నా పేరిట జరుగుతున్న మూడా చారాలు ,అన్యాయాలు ఆపు .
సదానందం దగ్గర కొచ్చి అడిగాడు సందేహం .
లేడు . నువ్వనుకొనే రీతిలో ఒక వస్తువుగా ,ఒక మనిషిగా దేవుడు లేనే లేడు .
అది నేను చెప్పే ముందు దీనికి సమాధానం చెప్పు . నేకు ప్రేమ అంటే తెలుసా ?
తెలుసు , అన్నాడు సందేహం .
మరైతే దానిని చూపించ గలవా ?
ఎలా చూపిస్తాం ? అనుభూతిలోకి తెచ్చు కొని ఇదే ప్రేమని చెప్పు కొంటున్నాం .
ప్రేమని ఒక భావం గా అనుభ వించి అది ప్రేమ అని భావన చేసి మళ్ళీ తిరిగి నువ్వు ప్రేమని పంచుతున్నావా ?
ఇంద్రియాలతో ,మనస్సుతో అనుభవం లోకి తెచ్చు కొంటున్న భావనలను భౌతికం గా చూ ప లే వు.
కా నీ ,అవే భావనలను నువ్వు పొరుగు వారితో పంచు కో గలవు .
మామూలు ఇంద్రియాలు ,మనస్సు అనుభ వించే భావనలను ,అనుభవాలను కేవలం అనుభూతిం చడం తప్ప బాహ్యం గా ఒక వస్తువు లేదా పదార్ధం రూపం లో చూప లేము .
అలాగే మానసిక భావన లైన కోపం ,అసూయ ,సంతోషం ,దుఖం ,స్వార్ధం -ఇవన్నీ మానసిక భావనలే గాని వాటికి రూపం ఉండదు . కానీ ,వాటి ఫలితాన్ని మనం చూస్తున్నాము . అవునా ? కాదా ?
. అలాగే 'దేవుడు ' అనేది ఒక "అధిమానసిక" ఆత్మీయ భావన .
ఆ భావన మనకు తృప్తి ని , అనుభూతిని కలగ చేస్తుందని , ఆ అనుభూతి ని కేవలం ఆత్మ తోనే పొందటం సాధ్యమని , అలా పొందడానికి కొన్ని సాధనా పద్దతులు ఉన్నాయని ,ముఖ్యం గా మనస్సుని పూర్తిగా నిశ్శబ్దం చేయాలని మహర్షుల వాక్యం .
అది ఒక దైవ సాధనా వ్యవస్థ . మతమే దైవం కాదు .
మరి మతం, దైవ సానిధ్యానికి త్రోవ చూపాలి. కానీ ,దేవుని పేరిట అనాచారాలు ,మూడ నమ్మకాలు ,బలహీన మనస్కులను తప్పు దారి పట్టించి పబ్బం గడుపు కోవ డాలు చేస్తున్న ఎన్నో సంస్థలను ,వ్యవస్థలను ,పీటాలను
దైవ మనే సముద్రం లో మతం అనేది ఓ చిన్ని పడవ లాంటిది . పడవ కు చిల్లు పడితే పడవ ని వదిలేయాలి .
పడవ ని నడిపే సరంగు దుర్మార్గు డై తే ఆ పడవే ఎక్క కూడదు .
మత మనేది సామాన్యుడిని దైవ సాధనా మార్గం లో ప్రవేశ పెట్ట డానికి ఉపయోగ పడే సూచనలు ,సంప్రదాయాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు , బోధలు మొదలగు వాటితో కూడిన వ్యవస్థ .
వీటిని నడిపే మనుషులు తప్పుడు వాళ్ల వ్వచ్చును గానీ ,వ్యవస్థ గానీ ,సిద్దాంతం గానీ తప్పుడు వి కావు.
సమాజం లో ఆచారాలు ,సంప్రదాయాలు అవసరమా ?
పొంగుతున్న నదికి అడ్డుకట్ట అవసర మే! అలాగే జంతు స్థితిలో ఉన్న మానవ మృగాలకు నియమ నిబంధనలు అత్యంత అవసరం.
సమాజం లో ఏ ఆచార మైనా , ఎలాంటి సంప్రదాయ మైనా ఆయా కాల మాన పరిస్థితులకు తగిన రీతిలో ,ఆయా సమాజాలలోని ప్రజల శారీరక ,మానసిక ,ఆధ్యాత్మిక ,సామాజిక ప్రశాంతత ,ఆనందం కోసం ఏర్పాటు చేసిన వే !
కానీ , సాంఘిక నియమాలు ఎప్పుడైతే మనిషి యొక్క గుణ గణాల బట్టి కాక పుట్టుక పై ఆధార పడి ఏర్పడి నాయో ,అప్పుడే సమతుల్యత దెబ్బ తింది . కుల వ్యవస్థ ,అంటరాని తనం , అమాయకులను మోసం చేయడం , జాలి ,కరుణ లేకుండా స్వార్ధం తో పొరుగు వాడిని తొక్కేసి అందలం ఎక్కాలను కోవడం -ఇలాంటి మానసిక వక్రాలన్నీ దురాచారాలకు ,దుష్ట సంప్ర దాయాలకు తె ర తీసాయి .
మత పెద్దలు ,కుల పెద్దలు ,ఊరి పెద్దలు మొదలగు పెద్ద మనుషులు బలహేనులను ,అమాయకులను మౌడ్యం లో పడేసి , దేవుడో లేదా దయ్యమో అనే పేరుతో భయ పెట్టి, వారి వారి బలహీనతల పై ఆడుకొని అణచి వేస్తున్నారు .
దురాచారాలకు, దంభా చారాలకు దేవుని ఉనికికి సంబంధం ఏముంది చెప్పండి ?
లోకం లో బల వంతులు ,బలహీనులు రెండే రెండు వర్గాలు .బలవంతులైన దుష్టుల నుండి బల హీనులైన శిష్టులను కాపాడ ట మే ధర్మ స్థాపన .
శారీరక బలం ,మానసిక బలం ,బుద్ధి బలం ,ఆత్మ బలం ఇవన్నీ వ్యక్తీ కి సంబంధించిన బలాలు .
సంపద ,డబ్బు , అధికారం -ఇవి కూడా బలాలే .
నీకు వ్యక్తీ గతం గా ఉన్న బలం తో.
మనకి "మంది బలం" ఎలా కూడుతుం ది ?
నీ చుట్టూ పది మందిని పోగుచేయాలి . పోగు పడాలి అంటే వాళ్లకు కావలసింది నువ్వు ఇవ్వాలి . నీకు కావలసింది వాళ్ళ దగ్గర పుచ్చు కోవాలి .
మతం పేరుతో ,కులం పేరుతో ,ప్రాంతం పేరుతో మందిని కూడ గట్టు కోవాలి .ఇది చాల తేలిక . ఎందు కంటే నువ్వు పుట్టిన మతం ,కులం నీకు మంది బలం , జన రక్షణ ,సమాజం లో గౌరవం పుట్టుకతో నే ఇచ్చేస్తాయి .
అంతే కాదు , నువ్వ్యు కష్ట పడి నీ తెలివి తేటలతో , నీ చుట్టూ ఉన్న జనాలను కలుపుకోవాలి .
నువ్వు పని చేస్తున్న సంస్థలో ని వారినీ ,అలాగే నీకున్న అలవాట్లు ఉన్న కొంత మందిని ఒకే తాటి పై కి తేగలగాలి.
దానినే నేడు , నాయకత్వ లక్షణం అంటారు .
నాయకుడు నిజాయితీ గల వాడైతే సమాజం బాగు పడుతుంది . వాడు అవినీతి ,అధర్మ పరు డై తే
బలహీనులు కష్టాల పాల పడి సమాజం అల్ల కల్లోలం అవుతుంది .
ఆస్తికుడు అనే పేరుతొ దయ ,శాంతం , ప్రేమ లేని వాడు అధర్మ పరుడు .
నాస్తికు డై నా సమ సమాజ భావనలతో బలహేనులకు కొమ్ము కాసే వాడు ... వాడే మాధవుడు !
మనిషిలో అరిషడ్వర్గాలను హెచ్చింప చేసే వాడు రాక్షసుడు .
మనిషిలోని ప్రేమ జ్యోతిని రగిలింప చేసే వాడే దేవుడు .
-----------------------------
అయ్యా ,నిజం చెప్పండి . దేవుడ నే శక్తి ఉందా ? సందేహం అడిగాడు సదా నందాన్ని .
నిన్నెవరు ప్రేమతో పెంచి పోషణ చేసారు ?
అలాగే ఈ జంతువులను ,పిట్టలను ఎవరు పెంచారు ?
అమ్మ నిన్ను ఎలా పెంచింది ?
ప్రేమతో నే పెంచిందని ఎలా చెప్పగలవ్ ?
నేను అమ్మ ప్రేమను అనుభ వించాను కాబట్టి చెబుతున్నా .
మరి ఈ సృష్టి కి కూడా పోషణ చేసే తల్లి ఉండాలని భావన చేసి ,మనస్సుని నిశ్శబ్దం చేసి ,వారి అధిమానసం లో
అనుభూతించిన ఆనందకర శాంతిమయ ప్రేమ పూరక స్థితిని మాత అని ,ఆది శక్తి అని ,దైవం అని ఎలుగెత్తి చాటారు
ఆధ్యాత్మిక గురువరేన్యులు మన సనాతన మహర్షులు ! మరి వారి అనుభూతులను నమ్మవా ?
వారు అనుభూతిమ్చినంత మాత్రాన మనం నమ్మాలా ? సందేహం ప్రశ్న .
మరి మన గురవయ్య పుట్టినప్పుడే వాడి తల్లి చని పోయింది . తల్లి ప్రేమని నమ్ముతాడో లేదో
చెప్పు గురవయ్యా , అందరికి అమ్మ ఉందని నువ్వు నమ్ముతావా ?
ఎలా నమ్ముతావ్ ,నువ్వెప్పుడూ మీ అమ్మను చూడ లేదుగా ?
అందరి అమ్మలను చూస్తున్నా గా , అమ్మ ప్రేమ ఇలా ఉంటుందని తెలుసు కొంటున్నా .
అమ్మలను చూస్తున్నావ్ సరే , అమ్మ ప్రేమని ఎలా తెలుసు కొన్నావ్ ?
నా కంటితో అమ్మను చూస్తున్నా ,నా మనస్సుతో అమ్మ ప్రేమని చూస్తున్నా .
ఎదుటి వాడు అమ్మ ప్రేమని పొందడం చూస్తున్నా.
వాడు అనుభూతం చెందుతున్న ప్రేమ ఇలా ఉంటుందని వివరి స్తుం టే నమ్ముతున్నా .
చూశావా సందేహం , మన మహర్షులు కూడా వారు అనుభూతం చేసుకొన్న దైవం గురించి చెప్పిన సనాతన వేద ,ఉపనిషత్ లన్నీ నిజమే అని నమ్మి ,మనం కూడా ఆ దైవాన్ని అనుభూతం చేసు కోవడానికి చేసే ప్రయత్నమే దైవ సాధన లేదా ఆధ్యాత్మిక సాధన .
అమ్మ ప్రేమ ఎంత నిజమో ' దైవ శక్తి ' అంతే నిజం .
దైవం లేద ను కోవడం నిన్ను నువ్వే లేడను కోవడం .
ఈ సృష్టి లో నువ్వెంత నిజమో , దైవ శక్తి కూడా అంతే నిజం !
ఈ సమాజం లో 'దైవం పేరుతో జరిగే వాటిలో మంచిని మాత్రమే స్వీకరించి చెడుని వదిలెయ్య గల సమర్ధత ను,
ధీ శక్తిని మనం పెంచు కోవాలి .
హింస జరగ కుండా అడ్డుపడట మే... అహింస .
అధర్మాన్ని మొగ్గలో తుంచి వేయడ మే .... ధర్మం .
అసంపూర్ణ మైన సత్యములను ,అబద్దాలను ఎదుర్కోవ డ మే ... సత్య పాలన .
సమాజం లో సమతుల్యతే .... వసుధైక కుటుంబం .